Share News

శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Oct 12 , 2026 | 03:55 AM

విజయవాడ దుర్గగుడిలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలను గ్రాండ్‌ సక్సెస్‌ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. దేవదాయ శాఖ, పర్యాటక శాఖ, ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం, మంత్రులతో సీఎం ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి

  • మంత్రులు, అధికారులతో సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం

అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): విజయవాడ దుర్గగుడిలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలను గ్రాండ్‌ సక్సెస్‌ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. దేవదాయ శాఖ, పర్యాటక శాఖ, ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం, మంత్రులతో సీఎం ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. అందరూ సమన్వయంతో పనిచేసి, వరుస కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఇతర రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు తరలివస్తున్న నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని, వీఐపీల రాక కారణంగా సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పండుగ సామాన్యుల దసరాగా ఉండాలి.. వీఐపీ దసరాగా కాదని స్పష్టం చేశారు. ఉన్నత స్థాయిలో అధికారులు తీసుకునే నిర్ణయాలకు అందరూ సహకరించాలని సూచించారు. దర్శనాలు, సౌకర్యాలకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.

విజయవాడ ఉత్సవ్‌ 2.0ను విజయవంతం చేయాలని పర్యాటక శాఖను ఆదేశించారు. మన సంస్కతి, సంప్రదాయాలు చాటేలా విజయవాడ ఉత్సవ్‌ను ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలని సూచించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దుర్గమ్మ దర్శనానికి, సరస్‌ మేళాకు హాజరవుతున్న నేపథ్యంలో ఆమె పర్యటనపైనా చర్చించారు. ఎస్‌హెచ్‌జీ మహిళలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు ‘స్వయం ఏపీ’ బ్రాండ్‌ కింద తమ ఉత్పత్తులను జాతీయ స్థాయిలో ప్రదర్శించి, విక్రయించేందుకు సర్‌సమేళా వేదిక కావాలని సీఎం ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేశ్‌, కొండపల్లి శ్రీనివాస్‌, అధికారులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి...

నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్

Updated Date - Oct 12 , 2026 | 03:55 AM