Share News

బాలసుబ్రహ్మణ్యం మరణం బాధాకరం

ABN , Publish Date - Nov 03 , 2026 | 06:41 AM

మాజీ ఐపీఎస్‌ అధికారి ఎన్‌.బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి సీఎం చంద్రబాబు సోమవారం నివాళులర్పించారు. అమెరికాలో ఆయన క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.

బాలసుబ్రహ్మణ్యం మరణం బాధాకరం

  • మాజీ ఐపీఎస్‌ అధికారి భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళి

విజయవాడ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మాజీ ఐపీఎస్‌ అధికారి ఎన్‌.బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి సీఎం చంద్రబాబు సోమవారం నివాళులర్పించారు. అమెరికాలో ఆయన క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని సోమవారం విజయవాడ తీసుకొచ్చారు. పోలీసుల సందర్శనార్థం ఏఆర్‌ గ్రౌండ్స్‌లో ఉంచగా, సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, మనోధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఉద్యోగ విరమణ చేసిన రెండు నెలలకే చనిపోవడం విచారకరమన్నారు. ఆయనతో తనకు సుదీర్ఘ అనుభవం ఉందని గుర్తు చేసుకున్నారు. మూడు దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో నిజాయితీతో పనిచేసి తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, విజయవాడ పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు, ఐపీఎస్‌ అధికారులు పీవీ సునీల్‌కుమార్‌, అన్బురాజన్‌, బి.రాజకుమారి, సీహెచ్‌ శ్రీకాంత్‌, మాజీ డీజీపీ మాలకొండయ్య, ఇంధన శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి విజయానంద్‌, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తదితరులు ఆయనకు నివాళులర్పించారు. అనంతరం పున్నమిఘాట్‌ వద్ద బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ వార్తలనూ చదవండి:

త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి

Updated Date - Nov 03 , 2026 | 06:41 AM