ఎన్సీసీ రాజు మృతికి సీఎం సంతాపం
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:54 AM
నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వ్యవస్థాపకులు, చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు మృతికి సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు.
అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వ్యవస్థాపకులు, చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు మృతికి సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. నిబద్ధత, నిజాయితీగల దార్శనిక పారిశ్రామికవేత్తగా దేశ నిర్మాణానికి, అభివృద్ధికి ఆయన అందించిన భాగస్వామ్యం చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. రాజు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. మంత్రి లోకేశ్ కూడా ఎన్సీసీ రాజు మృతికి సంతాపం తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..