Share News

రాష్ట్ర ప్రజలకు సీఎం దసరా శుభాకాంక్షలు

ABN , Publish Date - Oct 12 , 2026 | 03:57 AM

దుష్టశక్తులపై దైవశక్తి, అధర్మంపై ధర్మం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆదివారం నుంచి ప్రారంభమైన దసరా శరన్నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు సీఎం దసరా శుభాకాంక్షలు

అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): దుష్టశక్తులపై దైవశక్తి, అధర్మంపై ధర్మం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆదివారం నుంచి ప్రారంభమైన దసరా శరన్నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి కరుణా కటాక్షాలతో ఆంధ్రప్రదేశ్‌ సుభిక్షంగా వర్థిల్లాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. మంత్రి లోకేశ్‌ కూడా రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి...

నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్

Updated Date - Oct 12 , 2026 | 03:57 AM