Share News

డ్వాక్రా ఉత్పత్తులకు ‘స్వయం ఏపీ’ బ్రాండ్‌

ABN , Publish Date - Oct 15 , 2026 | 05:57 AM

రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు ప్రత్యేకంగా రూపొందించిన స్వయం ఏపీ బ్రాండ్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. బ్రాండింగ్‌తోపాటు దేశ, విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసే లక్ష్యంతో రూపకల్పన చేసిన ‘స్వయం ఏపీ’ బ్రోచర్‌ను సీఎం విడుదల చేశారు.

డ్వాక్రా ఉత్పత్తులకు ‘స్వయం ఏపీ’ బ్రాండ్‌

  • బ్రోచర్‌ విడుదల చేసిన సీఎం చంద్రబాబు

అమరావతి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు ప్రత్యేకంగా రూపొందించిన స్వయం ఏపీ బ్రాండ్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. బ్రాండింగ్‌తోపాటు దేశ, విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసే లక్ష్యంతో రూపకల్పన చేసిన ‘స్వయం ఏపీ’ బ్రోచర్‌ను సీఎం విడుదల చేశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, సెర్ప్‌ సీఈవో వాకాటి కరుణతో కలిసి సీఎం ఈ బ్రోచర్‌ను విడుదల చేశారు. 23 వేలకుపైగా ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకొస్తూ బ్రాండింగ్‌, ప్యాకేజింగ్‌, నాణ్యతా ప్రమాణాల నిర్ధారణ, మార్కెటింగ్‌ వంటి అంశాలను సమన్వయం చేసేలా మహిళలు సొంత మార్కెటింగ్‌ చేసేలా ఈ ‘స్వయం ఏపీ’ రూపుదిద్దుకోనుంది. గురువారం విజయవాడలో జరిగే సరస్‌ మేళాలోనూ ‘స్వయం ఏపీ’ బ్రాండ్‌ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్‌ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి

హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..

Updated Date - Oct 15 , 2026 | 05:57 AM