Share News

పేదింటి యువతికి పెద్ద మనసుతో అండ

ABN , Publish Date - Oct 15 , 2026 | 05:27 AM

మానవత్వం పరిమళించింది! క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న స్థానిక పాతగుంటూరు ప్రగతినగర్‌కు చెందిన సాయిలక్ష్మికి సాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు.

పేదింటి యువతికి పెద్ద మనసుతో అండ

  • క్యాన్సర్‌ బాధితురాలికి సిబార్‌ కళాశాల రూ.50 వేల సాయం

గుంటూరు కార్పొరేషన్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): మానవత్వం పరిమళించింది! క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న స్థానిక పాతగుంటూరు ప్రగతినగర్‌కు చెందిన సాయిలక్ష్మికి సాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ‘పేదింటి యువతికి ఎన్ని కష్టాలో’ శీర్షికర బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ మెయిన్‌ ఎడిషన్‌లో ఆమె ధీనగాథ ప్రచురితమైంది. దీనిపై పలువురు దాతలు స్పందించారు. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు సిబార్‌ దంత వైద్య కళాశాల యాజమాన్యం సాయిలక్ష్మికి రూ.50 వేల ఆర్థిక సహాయం అందించింది. ఇంకా, అనేకమంది వైద్యులు ఆమెను ఫోన్లో సంప్రదించి మెడికల్‌ రిపోర్టులు పెట్టాలని కోరారు. పలువురు ఫోన్‌ పే ద్వారా, బ్యాంక్‌ అకౌంట్‌ ద్వారా ఆర్థిక సాయం అందించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్‌ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి

హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..

Updated Date - Oct 15 , 2026 | 05:27 AM