డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయండి
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:24 AM
విజయవాడకు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో తనకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సీఐ నాగరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది.
హైకోర్టును ఆశ్రయించిన సీఐ నాగరాజు
అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): విజయవాడకు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో తనకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సీఐ నాగరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చింది. సిట్‌తో పాటు ఫిర్యాదుదారు గాదె విజయలక్ష్మికి నోటీసులు జారీ చేసింది. విచారణను దసరా సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. పిటిషనర్ తరఫున న్యాయవాది చల్లా అజయ్‌కుమార్ వాదనలు వినిపించారు.
ఈ వార్తలనూ చదవండి: