Tomato : మార్చి 2 నుంచి 15కిలోల క్రేట్లతో టమోటా వేలం
ABN , Publish Date - Feb 10 , 2026 | 01:31 AM
జిల్లాలోని మదనపల్లె, ములకలచెరువు, గుర్రంకొండ, అంగళ్లు టమోటా మార్కెట్లలో మార్చి 2వ తేదీ నుంచి 15 కిలోల క్రేట్లతోనే టమోట వేలం నిర్వహించనున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు పేర్కొన్నారు.
మదనపల్లె టౌన్, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మదనపల్లె, ములకలచెరువు, గుర్రంకొండ, అంగళ్లు టమోటా మార్కెట్లలో మార్చి 2వ తేదీ నుంచి 15 కిలోల క్రేట్లతోనే టమోట వేలం నిర్వహించనున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు పేర్కొన్నారు. సోమవారం మదనపల్లె మార్కెట్లో నాలుగు మార్కెట్ కమిటీల కార్యదర్శులు, మదనపల్లె, వాల్మీకిపురం మార్కెట్ కమిటీల చైర్మన్లతో జేడీ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ అన్ని మార్కెట్లలో ఒకేవిఽధంగా వేలం పాటలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మార్కెట్ కమిటీల ద్వారా క్రేట్లను తెప్పించి, రైతులకు, వ్యాపారులకు అద్దెకు ఇస్తామన్నారు. ఎవరైనా పెద్దక్రేట్లతో వేలం వేస్తే ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. జాక్‌పాట్ విధానం రద్దు చేశామన్నారు. ఈ సమావేశంలో మదనపల్లె, వాల్మీకిపురం మార్కెట్ కమిటీ చైర్మన్లు జంగాల శివరామ్, కోసూరి చంద్రమౌళి, ఏడీఎం త్యాగరాజు, కార్యదర్శులు జగదీష్, అభిలాష్, మదనమోహన్, సునీల్ పాల్గొన్నారు.