Liquor shops: మద్యం షాపుల రెన్యువల్‌కు నేడే ఆఖరి గడువు
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:41 AM
మద్యం షాపుల లైసెన్స్ రెన్యువల్ గడువు సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
చిత్తూరు సిటి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మద్యం షాపుల లైసెన్స్ రెన్యువల్ గడువు సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. జిల్లాలోని 113 మద్యం షాపుల యజమానుల్లో ఆసక్తిగల వ్యాపారులు ఏడాది కాలపరిమితికి 38 శాతం రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్(ఆర్‌ఈటీ) చెల్లించి పునరుద్ధరించుకోవచ్చు. కాగా, ఇప్పటి వరకు 78 మద్యం షాపుల యజమానులు రెన్యువల్ చేసుకున్నారు. జిల్లాలో చిత్తూరు అర్బన్ స్టేషన్ పరిధిలో 24, చిత్తూరు రూరల్‌లో 19, పులిచెర్లలో 7, నగరిలో 11, కుప్పంలో 11, పుంగనూరులో 15, పలమనేరులో 16, కార్వేటినగరంలో 10 మద్యం షాపులు (వీటిలో పది ‘గీత’ కార్మికులకు రిజర్వ్ చేశారు) చొప్పున మొత్తం 113 ఉన్నాయి.
గడువు దాటాక కూడా రెన్యువల్ కాని మద్యం షాపులకు మంగళవారం నుంచి 29వ తేది వరకు కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారు. 30న లాటరీ ద్వారా కొత్త లైసెన్సీలను ఎంపిక చేస్తారు. వీటి దరఖాస్తు రుసుమును రూ.3 లక్షలుగా (నాన్ రీఫండబుల్) నిర్ణయించారు. అక్టోబరు ఒకటి నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు 30వ తేది వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుంది.