Ramadan: నేడు రంజాన్
ABN , Publish Date - Mar 20 , 2026 | 11:50 PM
జిల్లాలో శనివారం రంజాన్ పండగ జరుపుకోనున్నారు. దీనికోసం మసీదులను విద్యుద్దీపాలతో అలంకరించారు.
చిత్తూరు కల్చరల్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం రంజాన్ పండగ జరుపుకోనున్నారు. దీనికోసం మసీదులను విద్యుద్దీపాలతో అలంకరించారు. శుక్రవారం రాత్రి మసీదులు విద్యుద్దీపాలతో వెలుగులీనాయి. ఇక, ఈద్గాల వద్ద రంజాన్ ప్రార్థనలు చేసుకోవడానికి షామియానాలు, ఇతర వసతులను ఏర్పాటు చేశారు. చిత్తూరులో ఈద్గాల వద్ద కమిషనరు నరసింహప్రసాద్ ఆధ్వర్యంలో తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించారు. ఇతర పట్టణాల్లో ఆయా మున్సిపల్ సిబ్బంది ఈ ఏర్పాట్లు చేశారు. నెల రోజులుగా రంజాన్ ఉపవాస దీక్షలు నిర్వహించి అల్లాను భక్తి ప్రపత్తులతో ఆరాధించి ప్రార్థనలు చేశారు. శుక్రవారం సాయంత్రం నెలవంక కనిపించింది. శనివారం రంజాన్ జరుపుకోవాలని జిల్లా ప్రభుత్వ ఖాజీ కమాలుల్లా జుహరి జెనైది తెలిపారు. ఈ మేరకు చిత్తూరులో ఆటోల ద్వారా అనౌన్స్ చేశారు. ఇదిలా ఉండగా నగరంలోని కన్నయ్య నాయుడు వీధి మసీదులో ప్రపంచ శాంతికోసం చిత్తూరు డివిజనల్ ప్రభుత్వ ఖాజీ సయ్యద్ నయీముల్లా ఆల్ జునైది ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.