Registrations: రిజస్ట్రేషన్ల కోసం రద్దీ
ABN , Publish Date - Jan 31 , 2026 | 01:43 AM
జిల్లాలోని సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలన్నీ మూడు రోజులుగా కిటకిటలాడుతున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుంచి భూ విలువలు పెరగనున్నాయి.
చిత్తూరు కలెక్టరేట్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలన్నీ మూడు రోజులుగా కిటకిటలాడుతున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుంచి భూ విలువలు పెరగనున్నాయి. దీంతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న క్రయ, విక్రయదారులు శనివారంలోగా వాటిని రిజిస్ర్టేషన్ చేసుకోవాలని తొందరపడుతున్నారు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని.. స్లాట్ ఉన్నా లేకున్నా వీలైనంత వరకు అన్ని డాక్యుమెంట్లను అర్ధరాత్రయినా రిజిస్ర్టేషన్ చేయాలని ఎస్‌ఆర్‌లను అధికారులు ఆదేశిస్తున్నారు. గురువారం రూ.1.70 కోట్ల ఆదాయం రాగా, శుక్రవారం రూ.1.80 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరింది. చివరి రోజైన శనివారం రూ.2 కోట్లు లేదా రూ. 2.50 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. శనివారం రిజిస్ట్రేషన్ల ఒత్తిడి పెరిగి సర్వర్ సమస్య ఉండే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.