Share News

Census: జనగణనకు రెడీ

ABN , Publish Date - Apr 03 , 2026 | 02:00 AM

దేశ భవిష్యత్తును నిర్ణయించే జనగణన కార్యక్రమంలో భాగంగా ఈనెల 16 నుంచి 30వ తేది వరకు సెల్ఫ్‌ ఎన్‌రోల్‌మెంట్‌ (సొంతంగా ఆన్‌లైన్‌లో నమోదు) కార్యక్రమం జరగనుంది.

Census: జనగణనకు రెడీ

3092 హౌస్‌ లిస్ట్‌ బ్లాక్‌లో గుర్తింపు

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): దేశ భవిష్యత్తును నిర్ణయించే జనగణన కార్యక్రమంలో భాగంగా ఈనెల 16 నుంచి 30వ తేది వరకు సెల్ఫ్‌ ఎన్‌రోల్‌మెంట్‌ (సొంతంగా ఆన్‌లైన్‌లో నమోదు) కార్యక్రమం జరగనుంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సెన్సెస్‌ 2027 యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఎవరికి వారు సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ చేసుకోవచ్చు. దీనిని ఎలా చేసుకోవాలనే దానిపై అధికారులు అవగాహన కల్పిస్తారు. ఇప్పటివరకు సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆయా కుటుంబాల వివరాలు నమోదు చేసేవారు. ఈసారి పెన్ను, పేపరు వాడకుండా డిజిటల్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. మరికొన్ని కొత్త విధానాలు సైతం తీసుకొని వచ్చారు. అధికారికంగా మాత్రం మే 1 నుంచి జిల్లావ్యాప్తంగా జనగణనను ఇంటింటికీ వెళ్ళి ఎన్యుమరేషన్‌ చేపడతారు. జనగణనకు సంబంధించి జిల్లా యంత్రాంగం సర్వం సన్నద్ధంగా ఉంది. జిల్లాస్థాయిలో జనగణన విజయవంతంగా నిర్వహించేందుకు చార్జ్‌ సెన్సెస్‌ ఆఫీసర్లను నియమించా రు. 2011 సెన్సెస్‌ ప్రకారం జిల్లా జనాభా 16,43,224 మంది. భౌగోళికంగా ఆటు గ్రామీణ, ఇటు పట్టణ ప్రాంతాల్లో ఎంతమంది నివసిస్తున్నారన్నది సమగ్రంగా సర్వే నిర్వహించనున్నారు. ప్రతి 200 కుటుంబాలను సగటున 600- 800 మంది జనాభా ప్రాతిపదికన ఒక ఎన్యుమరేషన్‌ బ్లాక్‌ (హెచ్‌ఎల్‌డీ-హౌ్‌స లిస్ట్‌ బ్లాక్‌)గా విభజిస్తారు. అలా జిల్లాలో 30-32 హెచ్‌ఎల్బీ విభజిస్తారు. ఈ ప్రాతిపదికన జనగనణను నిర్వహిస్తారు. 3032 ఎన్యూమరేటర్లు, 500 మంది సూపర్వైజర్లను ఇందుకోసం కలెక్టర్‌ నియమించనున్నారు. ఎన్యూమరేటర్లుగా వార్డు, గ్రామ స్వర్ణ సచివాలయ సిబ్బందిని వినియోగించనున్నారు. ఏడాది పాటు సెన్సెస్‌ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రాథమికంగా నివాసగృహాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తే, వీటి ఆధారంగా జనాభా లెక్కలను 2027లో నమో దు చేయనున్నారు. నివాసగృహాల వివరాల సేకరణ కోసం 33ప్రశ్నలకు యజమానుల నుంచి సమాచా రం రాబట్టనున్నారు. పనిలోపనిగా ఇప్పుడు ఇంటి నెంబర్లకు అదనంగా జనగణన కోసం వారికి ప్రత్యేక నెంబర్లను ఎన్యుమరేటర్లు కేటాయించనున్నారు.

Updated Date - Apr 03 , 2026 | 02:00 AM