Green Awards: 8 పాఠశాలలకు హరిత అవార్డులు
ABN , Publish Date - Jan 31 , 2026 | 01:45 AM
గ్రీన్ స్కూల్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఎనిమిది పాఠశాలలకు హరిత అవార్డులు లభించాయి.
చిత్తూరు సెంట్రల్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): గ్రీన్ స్కూల్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఎనిమిది పాఠశాలలకు హరిత అవార్డులు లభించాయి. ఈ మేరకు శనివారం న్యూఢిల్లీలోని ఇండియా హాబిటేట్ సెంటర్‌లోని స్టెయిన్ ఆడిటోరియంలో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమంలో ఆ విభాగం డైరెక్టర్ సునీత నరెయిన్ నుంచి ఏపీఎన్‌సీజీ జిల్లా సమన్వయకర్త, గంగవరం మండలం కల్లుపల్లి ఉన్నత పాఠశాల హెచ్‌ఎం బాలచైతన్య గ్రీన్ స్కూల్ అవార్డు అందుకున్నారు. గంగవరం మండలం పత్తికొండ, గుడిపాల మండలం బొమ్మసముద్రం, తరిగొండ, కరకంబాడి, వెదురుకుప్పం ఉన్నత పాఠశాలలతో పాటు పుత్తూరు బాలికల ఉన్నత పాఠశాల, ఆర్‌కేఎంపురం ఉన్నత పాఠశాల చింతలపట్టెడ ఉన్నత పాఠశాలలు జిల్లాలో ఎంపికయ్యాయి. కార్యక్రమంలో ఏపీఎన్‌జీసీ రాష్ట్ర సమన్వయకర్త నీలకంఠయ్య పాల్గొన్నారు.