Fog: కమ్మేసిన మంచు
ABN , Publish Date - Nov 22 , 2026 | 01:15 AM
శనివారం పొద్దుపొద్దున్నే తెరలుతెరలుగా కురిసే మంచు తుంపరల్లో కుప్పం పట్టణం తడిసి ముద్దయింది. రామకుప్పం ప్రాంతంలోనూ దట్టమైన పొగమంచు ఉక్కిరిబిక్కిరి చేసింది.
కుప్పం/రామకుప్పం(ఆంధ్రజ్యోతి): దూరంగా వంతెన మీదకు సాగిపోతున్న ఆటో ఇంటికేటర్ బల్బు బలహీనంగా వెలుగులీనుతుంటుంది. ఇటువైపు కూడలి దాటుతున్న మలుపున లగేజీ వాహనమోటి కదలడానికి బద్ధకించి ఉన్నచోటనే నిలబడిపోతుంది. పొగలు కక్కుతున్న టీ కప్పులతో నిలబడ్డ దూర ప్రయాణికుల పక్కనే, ఆగిన ద్విచక్ర వాహనాలు ఒకదానితో మరోటి ఊసులాడుకుంటుంటాయి. శనివారం పొద్దుపొద్దున్నే తెరలుతెరలుగా కురిసే మంచు తుంపరల్లో కుప్పం పట్టణం తడిసి ముద్దయింది. రామకుప్పం ప్రాంతంలోనూ దట్టమైన పొగమంచు ఉక్కిరిబిక్కిరి చేసింది. ఉదయం 8గంటలకూ లైట్ల వెలుగులోనే వాహనచోదకులు రాకపోకలు సాగించారు. మంచు తెరలు కమ్మేయడంతో ప్రకృతి కాంత కొత్త అందాలను సంతరించుకుంది.