Liquor: మద్యం దుకాణాలు, బార్ల మూసివేత
ABN , Publish Date - Oct 31 , 2026 | 02:26 AM
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తిరుపతి అర్బన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించింది.
తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తిరుపతి అర్బన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించింది. మద్యం దుకాణాలు, బార్లను నిర్దేశిత సమయాల్లో మూసివేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ రామచంద్ర తెలిపారు. అర్బన్ పరిధిలో 33 మద్యం దుకాణాలు, 15 బార్లు, మరో 4 స్టార్ హోటళ్లలో బార్లు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు శుక్రవారం సాయంత్రం నుంచి ఆయా మద్యం దుకాణాలు, బార్లను మూయించి తాళాలు వేశారు. ఆదివారం పోలింగ్ జరగనుండటంతో ఆ రోజున సాయంత్రం ఐదు గంటల వరకు వీటిని మూసివేయనున్నట్లు చెప్పారు. అలాగే నవంబరు మూడో తేదీన కౌంటింగ్ రోజున కూడా మద్యం దుకాణాలు, బార్లను పూర్తిగా మూసివేస్తామని వెల్లడించారు. పోలింగ్ మరుసటి రోజైన సోమవారం మాత్రం 2న మాత్రం దుకాణాలు తెరిచేందుకు అవకాశం ఉంటుందన్నారు.