RTO: అదనపు చార్జీల భారం మోపితే చర్యలు
ABN , Publish Date - Jan 11 , 2026 | 02:33 AM
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వచ్చే ప్రయాణికులపై అదనపు చార్జీల భారం మోపితే చర్యలు తప్పవని ఆర్టీవో అశోక్‌ప్రతాప్ హెచ్చరించారు.
మదనపల్లె అర్బన్, జనవరి 10(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వచ్చే ప్రయాణికులపై అదనపు చార్జీల భారం మోపితే చర్యలు తప్పవని ఆర్టీవో అశోక్‌ప్రతాప్ హెచ్చరించారు. ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు తమదృష్టికి వచ్చిందన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ శనివారం నుంచి మదనపల్లె మీదుగా విజయవాడ, హైదరాబాదు, బెంగళూరు, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీ నిర్వహించమన్నారు. సీటింగ్ కెపాసిటీ, బస్సు కండిషన్, ఎమర్జెన్సీ డోర్లు, రక్షణ పరికరాలు, తదితరాలను పరిశీలించామన్నారు. ఈ నెల 18వతేదీ వరకు తమ శాఖ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. రెడ్ బస్, అబీ బస్ యాప్‌ల ద్వారా అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకొంటామని స్సష్టం చేశారు. తనిఖీల్లో అశోక్‌ప్రతా్‌పతోపాటు ఎంవీఐ దినే్‌షచంద్ర పాల్గొన్నారు. అధిక చార్జీలు వసూలు చేస్తే రవాణా శాఖ హెల్ప్‌లైన్ నంబరుకు (9281607001) సమాచారం అందివ్వాలని ప్రయాణికులకు ఆర్టీఏ సూచించారు.