Share News

స్వదేశానికి వచ్చేందుకు సహకరించండి

ABN , Publish Date - Sep 25 , 2026 | 05:21 AM

బతుకుదెరువు కోసం విదేశానికి వెళ్లిన ఓ మహిళ స్వదేశానికి తిరిగి రాలేక అవస్థలు పడుతోంది. బాధితురాలు వీడియోలో పేర్కొన్న వివరాలిలా.. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం తలారివారిపల్లెకు చెందిన ఇందిర ఏడు నెలల క్రితం ఉపాధి కోసం ఒమాన్‌ దేశంలోని మస్కట్‌కు వెళ్లింది.

స్వదేశానికి వచ్చేందుకు సహకరించండి

  • సీఎం, డిప్యూటీ సీఎంకు మస్కట్‌లో చిక్కుకున్న మహిళ విజ్ఞప్తి

కల్లూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): బతుకుదెరువు కోసం విదేశానికి వెళ్లిన ఓ మహిళ స్వదేశానికి తిరిగి రాలేక అవస్థలు పడుతోంది. బాధితురాలు వీడియోలో పేర్కొన్న వివరాలిలా.. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం తలారివారిపల్లెకు చెందిన ఇందిర ఏడు నెలల క్రితం ఉపాధి కోసం ఒమాన్‌ దేశంలోని మస్కట్‌కు వెళ్లింది. కువైత్‌కు పంపుతామని చెప్పిన ఏజెంట్లు మోసం చేసి ఆమెను మస్కట్‌కు పంపారు. అక్కడ ఇంటి యజమాని వేధింపులకు గురిచేస్తూ ఇబ్బందులు పెడుతున్నాడు. ఇందిర భర్త వెంకట రమణ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుమారుడు చదువుకుంటున్నాడు. వీరిద్దరి అవసరాల కోసం తాను గల్ఫ్‌కు వచ్చానంటూ ఇందిర కన్నీటిపర్యంతమైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ స్పందించి తనను స్వదేశానికి రప్పించాలని విఙ్ఞప్తి చేసింది. కాగా బాధిత మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆమెను స్వదేశానికి రప్పించే బాధ్యత తీసుకోవాలని ఏజెంట్లను ఆదేశించామన్నారు.

ఈ వార్తలనూ చదవండి...

అదానీ సిమెంట్ కర్మాగారంలో భారీ ప్రమాదం.. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు..

పీజీ కోర్సుల్లో చేరేవారేరి?

Updated Date - Sep 25 , 2026 | 05:21 AM