Share News

ఏపీ జీఎస్టీలో ఏఐ విప్లవం!

ABN , Publish Date - Sep 27 , 2026 | 05:03 AM

ఏపీ వాణిజ్యపన్నుల శాఖలో అమలు చేస్తున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సాంకేతిక ఆధారిత సంస్కరణలు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర పన్నుల శాఖ అధికారులను విశేషంగా ఆకర్షించింది.

ఏపీ జీఎస్టీలో ఏఐ విప్లవం!

  • ఛత్తీస్‌గఢ్‌ అధికారుల ప్రశంసలు

అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఏపీ వాణిజ్యపన్నుల శాఖలో అమలు చేస్తున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సాంకేతిక ఆధారిత సంస్కరణలు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర పన్నుల శాఖ అధికారులను విశేషంగా ఆకర్షించింది. ఈ విధానంపై అధ్యయనం చేయడానికి ఆ రాష్ట్ర పన్నులశాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఏపీలో పర్యటిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ ప్రత్యేక కమిషనర్‌ తరన్నుమ్‌ వర్మ నేతృత్వంలోని ఈ బృందం 3 రోజుల పాటు ఇక్కడ అమలు చేస్తున్న సాంకేతిక విధానాలను పరిశీలించింది. ఏపీ అవలంబిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌, పన్ను ఎగవేత నిరోధక చ ర్యలు, రాబడి పెంపుదల వ్యూహాలు, క్షేత్రస్థాయి తనిఖీల కోసం రూపొందించిన మొబైల్‌ అప్లికేషన్లను ఆ బృందం పరిశీలించింది. పన్ను చెల్లింపుదారుల రిస్క్‌ ప్రొఫైలింగ్‌, అనుమానాస్పద లావాదేవీల గుర్తింపు, కేసుల కేటాయింపు నుంచి చట్టబద్ధమైన నోటీసుల డ్రాఫ్టింగ్‌ వరకు దర్యా ప్తు ప్రక్రియ అంతా ఏఐతోనే సాగుతోంది. అలాగే, కోర్టు కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి లీగల్‌ వింగ్‌ రూపొందించిన లీగల్‌ ఏఐ, డిజిటల్‌ కేసు మేనేజ్‌మెంట్‌ విధానాలను కూడా ఈ బృందం పరిశీలించింది. అనంతరం, ఏఐ ట్యాక్స్‌ సొల్యూషన్స్‌. సాంకేతికతపై తమ అధికారులకు శిక్షణ ఇవ్వాలని ఛత్తీ్‌సగఢ్‌ బృందం కోరింది.

ఈ వార్తలనూ చదవండి:

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పర్యాటకం జోరు

Updated Date - Sep 27 , 2026 | 05:03 AM