Share News

తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండండి

ABN , Publish Date - Nov 17 , 2026 | 05:59 AM

కోస్తాంధ్రను ఈ నెల 20 తేదీన తాకనున్న తుఫానుపై ప్రత్యామ్నాయ ప్రణాళికలు అమలు చేస్తూనే... ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండండి
CM Chandrababu Naidu

  • వర్షపు నీటిని జలాశయాలకు మళ్లించండి: సీఎం

అమరావతి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): కోస్తాంధ్రను ఈ నెల 20 తేదీన తాకనున్న తుఫానుపై ప్రత్యామ్నాయ ప్రణాళికలు అమలు చేస్తూనే... ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ కేంద్రంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. తుఫాను పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న తుఫాను ప్రభావం కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు జిల్లా సహా వివిధ ప్రాంతాలపై ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ముందుగానే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపటంతోపాటు విద్యుత్‌ సరఫరాను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేలా సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని సీఎం చెప్పారు. భారీ వర్షాల వల్ల వచ్చే వరద ప్రవాహాలను రిజర్వాయర్లకు మళ్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. వరద నీటిని జలాశయాలకు తరలించేలా కార్యాచరణను అమలు చేస్తే వేసవిలో మంచినీటి కొరతను అధిగమిస్తామన్నారు. ప్రాణ నష్టం లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

Updated Date - Nov 17 , 2026 | 06:18 AM