ప్రజారోగ్య రంగంలో హెల్త్ వర్సిటీది కీలక పాత్ర
ABN , Publish Date - Oct 27 , 2026 | 04:49 AM
డా.ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు, వైద్యులు, పరిశోధకులు, సిబ్బంది అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో స్పందిస్తూ...
40 ఏళ్లు పూర్తిచేసుకున్న వర్సిటీకి సీఎం శుభాకాంక్షలు
అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): డా.ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు, వైద్యులు, పరిశోధకులు, సిబ్బంది అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో స్పందిస్తూ... ‘దివంతగ ఎన్టీఆర్ సంకల్పంతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం నాలుగు దశాబ్దాలుగా వైద్య, విద్య, పరిశోధన, ప్రజారోగ్య రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. నాణ్యమైన వైద్య విద్యతో సమాజానికి నిబద్ధత కలిగిన వైద్యులను అందించడం గర్వకారణం.
వైద్యం ఒక వృత్తి మాత్రమే కాదు. ప్రాణాలను కాపాడే పవిత్రమైన బాధ్యత. సాంకేతికత వైద్యానికి శక్తిని ఇస్తే, మానవత్వం ఆ వైద్యానికి మరింత విలువ చేకూరుస్తుంది. 40 ఏళ్ల వైద్య సేవా స్ఫూర్తితో ఈ విశ్వవిద్యాలయం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి’ అని ఆకాంక్షించారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్