Share News

వేడుకగా చక్రస్నానం

ABN , Publish Date - Sep 24 , 2026 | 06:31 AM

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన ధ్వజావరోహణం బుధవారం సాయంత్రం శాస్ర్తోక్తంగా జరిగింది. ఈనెల 15వ తేదీన మొదలైన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజారోహణం నిర్వహించారు. తెల్లవారుజాము 3 నుంచి 6 గంటల వరకు స్వామికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు.

వేడుకగా చక్రస్నానం

  • ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన ధ్వజావరోహణం బుధవారం సాయంత్రం శాస్ర్తోక్తంగా జరిగింది. ఈనెల 15వ తేదీన మొదలైన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజారోహణం నిర్వహించారు. తెల్లవారుజాము 3 నుంచి 6 గంటల వరకు స్వామికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. అనంతరం 9 గంటల వరకూ భూవరాహస్వామి ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి, సుదర్శన చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. తర్వాత సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణి జలంలో మూడు మునకలు వేయించారు. సాయంత్రం తిరుచ్చి ఉత్సవం తర్వాత ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ధ్వజావరోహణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి.

Updated Date - Sep 24 , 2026 | 06:31 AM