Share News

ఏపీకి రూ.68 వేల కోట్ల నిధులు: కేంద్ర సహాయ మంత్రి

ABN , Publish Date - Sep 27 , 2026 | 03:56 AM

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మంజూరు చేసిన రూ.68 వేల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని కేంద్ర రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి వి.సోమన్న తెలిపారు.

ఏపీకి రూ.68 వేల కోట్ల నిధులు: కేంద్ర సహాయ మంత్రి

  • మరో మంత్రి పెమ్మసానితో కలిసి గుంటూరులో ఆర్‌ఓబీకి భూమి పూజ

గుంటూరు కార్పొరేషన్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మంజూరు చేసిన రూ.68 వేల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని కేంద్ర రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి వి.సోమన్న తెలిపారు. గుంటూరులో రూ.147 కోట్లతో నిర్మించనున్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి ఆయన శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సోమన్న మాట్లాడుతూ నిడదవోలు, మంగళగిరి తదితర ఎనిమిది స్టేషన్లు ఇప్పటికే అభివృద్ధి చెందాయని, అందులో సుమారు నాలుగు రైల్వేస్టేషన్లలో రూ.350 కోట్లతో, మరికొన్ని రూ.450 కోట్లతో అభివృద్థి చెందాయన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ గుంటూరు జిల్లాకు ఎనిమిది ఆర్‌ఓబీలు మంజూరు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 78 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, బూర్ల రామాంజనేయులు, నసీర్‌ అహ్మద్‌, గళ్లా మాధవి పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పర్యాటకం జోరు

Updated Date - Sep 27 , 2026 | 04:10 AM