ఏపీ పొగాకు రైతులకు కేంద్రం ఊరట
ABN , Publish Date - Oct 17 , 2026 | 04:29 AM
రాష్ట్రంలోని వర్జీనియా పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రస్తుత 2026-27 పంట కాలంలో నమోదిత రైతులు తమ కోటా కంటే అదనంగా పండించిన ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా (ఎఫ్‌సీవీ) పొగాకును పొగాకు బోర్డు అధికారిక వేలం వేదికలపై అమ్ముకునేందుకు అనుమతిచ్చింది.
అదనపు ఎఫ్‌సీవీ పొగాకు అమ్మకాలకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వర్జీనియా పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రస్తుత 2026-27 పంట కాలంలో నమోదిత రైతులు తమ కోటా కంటే అదనంగా పండించిన ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా (ఎఫ్‌సీవీ) పొగాకును పొగాకు బోర్డు అధికారిక వేలం వేదికలపై అమ్ముకునేందుకు అనుమతిచ్చింది. పొగాకు బోర్డు వద్ద నమోదైన వ్యాపారులు, డీలర్లు కూడా ఈ అదనపు పొగాకును కొనుగోలు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు పొగాకు బోర్డు చట్టం-1975లోని ఆంక్షలను సడలిస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. పొగాకు రైతులు బహిరంగ మార్కెట్లో నష్టపోకుండా అదనపు నిల్వల విక్రయానికి అనుమతిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు