మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో.. నేడు, రేపు కేంద్ర బృందం పర్యటన
ABN , Publish Date - Nov 13 , 2026 | 04:18 AM
మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజులపాటు కేంద్ర బృందం పర్యటించనుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్‌దాస్ నేతృత్వంలోని
అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజులపాటు కేంద్ర బృందం పర్యటించనుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్‌దాస్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం శుక్ర, శనివారాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి, తుఫాన్ నష్టాలను అంచనా వేయనున్నది. శుక్రవారం ఒక బృందం బాపట్ల జిల్లాలో, మరో బృందం ఏలూరు జిల్లాలో పర్యటిస్తుంది.
శనివారం మొదటి బృందం పల్నాడు జిల్లాలో, రెండో బృందం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తుంది. కేంద్ర బృంద సభ్యులు తుఫాన్ నష్టాన్ని పరిశీలించడంతోపాటు బాధిత రైతులతో మాట్లాడతారని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు. కాగా ఇటీవల అర్నబ్ తుఫాన్ నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చిన బృందాన్నే మురసు తుఫాన్ నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించింది.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు