ఆంధ్రా కోడలిగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నా
ABN , Publish Date - Oct 03 , 2026 | 03:34 AM
‘‘ఆంధ్రా కోడలిగా రాయలసీమతో పాటు రాష్ట్రాభివృద్ధికి ఎప్పటికీ కట్టుబడే ఉంటా. పల్లెలే పట్టుకొమ్మలన్న మహాత్మా గాంధీ, జై జవాన్.. జై కిసాన్ అని..
రాయల సీమను రతనాల సీమగా మారుస్తాం: నిర్మల
రతనాల సీమగా మారుస్తాం: నిర్మలా సీతారామన్
మదనపల్లె, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రా కోడలిగా రాయలసీమతో పాటు రాష్ట్రాభివృద్ధికి ఎప్పటికీ కట్టుబడే ఉంటా. పల్లెలే పట్టుకొమ్మలన్న మహాత్మా గాంధీ, జై జవాన్.. జై కిసాన్ అని నినదించిన లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషితో రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం.’’ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ లా సీతారామన్ అన్నారు. మదనపల్లెలో శుక్రవారం జరిగిన రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు సీమలోని 8 జిల్లాలతో పాటు, పక్కనే ఉన్న మరో 2 జిల్లాలను కలుపుకొని మొత్తం 10 జిల్లాల్లో ‘హార్టికల్చర్ హబ్’ ఏర్పాటవుతోందన్నారు. ఈ ప్రాంతాన్ని ‘వరల్డ్ బెస్ట్ ప్రొడక్షన్ సెంటర్’గా మార్చబోతున్నామన్నామని తెలిపారు. ‘‘వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను, ఏఐని ఉపయోగించి రిలయన్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’(ఐఎ్‌సఏ)ను ఏర్పాటు చేస్తుండటం దేశానికే గర్వకారణం. రాయలసీమ రైతుల కష్టపడే తత్వాన్ని చూసే ఇంతటి భారీ కార్పొరేట్ సంస్థ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.’’ అని నిర్మలా సీతారామన్ అన్నారు. ‘‘నేను ఆంధ్ర కోడలిగా ఇక్కడికి వచ్చినప్పుడు సీమ గురించి చాలా పట్టుదలగా మాట్లాడుతుంటా. కోడలిగా ఏపీపై ఎంతో ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా సీమ అభివృద్ధి పట్ల నాకు ప్రత్యేకమైన పట్టుదల ఉంది. సీఎం ఎప్పుడు కలిసినా సీమ రైతుల కష్టాల గురించి చెబుతూ, ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలని కోరుతుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషితో రాయలసీమ రైతుల జీవితాల్లో మార్పు కచ్చితంగా వస్తుంది.’’ అని భరోసా ఇచ్చారు.
ఒక్క నిమిషం మాట వినండి!
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తుండగా.. సభలో యువత అరుపులు, కేకలతో హల్‌చల్ చేశారు. ‘‘ఒక్క నిమిషం మాట వినండి. మనకు మంచి చేసిన వాళ్ల గురించి మాట్లాడుకుందాం. నేను చెప్పేది వినండి.’’ అని ఆమె విన్నవించారు. అయినా, యువత ఏమాత్రం వినిపించుకోలదు. ‘జై పవన్- జై పవన్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో కేంద్ర మంత్రి ప్రసంగాన్ని ఆపేయాల్సి వచ్చింది. అక్కడే వేదికపై ఉన్న సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని, ‘తమ్ముళ్లూ దయచేసి సైలెంట్‌గా కూర్చోవాలి. ఇది కరెక్ట్ కాదు. కేంద్రమంత్రి సందేశం కూడా చాలా ముఖ్యం. దయచేసి కూర్చోవాలి. మీ ఉత్సాహం మాకు అర్థమైంది. దయచేసి కూర్చోండి.’’ అంటూ గట్టిగా చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి..
స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు
శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు