Share News

సాయికృష్ణ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నాం

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:47 AM

విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ మృతి వ్యవహారంలో అతని తల్లి విజయలక్ష్మి వేసిన పిటిషన్‌పై విచారణ జరిపి, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ..

సాయికృష్ణ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నాం

  • హైకోర్టు ఆదేశాల మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం: సీబీఐ

  • పిల్‌పై విచారణ మూసివేసిన హైకోర్టు

అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ మృతి వ్యవహారంలో అతని తల్లి విజయలక్ష్మి వేసిన పిటిషన్‌పై విచారణ జరిపి, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టులోని మరో ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చిందని సీబీఐ స్టాండింగ్‌ కౌన్సిల్‌ పీఎస్‌పీ సురేశ్‌కుమార్‌ సీజే నేతృత్వంలోని ధర్మాసనానికి నివేదించారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తోందన్నారు. ఈ వివరాలతో మెమో దాఖలు చేశామని చెప్పారు. కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతూ దాఖలైన పిల్‌ పై విచారణను మూసివేయాలని కోరారు.

ఈ వివరాలు నమోదు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం పిల్‌ను డిస్పోజ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. పోలీసుల కస్టోడియల్‌ టార్చర్‌ కారణంగా విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మృతి చెందాడనే ఆరోపణలతో నమోదైన కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతూ సొసైటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ కాన్టిట్యూషనల్‌ రైట్స్‌ అధ్యక్షుడు గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!

ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Updated Date - Oct 28 , 2026 | 06:47 AM