Share News

హెల్త్‌లో పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:50 AM

శ్రీకాకుళంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీతో కలిసి బొల్లినేని మెడ్‌స్కిల్స్‌ అందిస్తున్న రెండు కోర్సులకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

హెల్త్‌లో పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

శ్రీకాకుళం, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీతో కలిసి బొల్లినేని మెడ్‌స్కిల్స్‌ అందిస్తున్న రెండు కోర్సులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. రెండేళ్ల కాలవ్యవధి కలిగిన మాస్టర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో 40 సీట్లు, పీజీ డిప్లోమో ఇన్‌ మెడికల్‌ రికార్డ్స్‌ అండ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ ఏడాది కోర్సులో 40 సీట్లు ఉన్నాయి. మెడిసిన్‌, ఫార్మసీ, నర్సింగ్‌ సహా సాధారణ డిగ్రీలో ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను అక్టోబర్‌ 15లోగా పంపుకోవాలి. మరిన్ని వివరాలకు 7995013422, 7680945357 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చు. వెబ్‌సైట్‌: www.brau.edu.in., www.bollinenimedskills.in

ఈ వార్తలనూ చదవండి:

పెట్టుబడుల స్వర్గధామం ఏపీ

నాడు అడ్డగోలు.. నేడు గగ్గోలు

Updated Date - Oct 13 , 2026 | 04:50 AM