Share News

లిక్కర్‌ స్కాంలో పెద్ద చేపలు జైలుకు వెళ్లడం ఖాయం

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:47 AM

‘వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగినట్టు సిట్‌ దర్యాప్తులో తేలింది. లిక్కర్‌ స్కాంలో ఇప్పటికే కొన్ని చేపలు జైలుకు వెళ్లాయి. రానున్న రోజుల్లో పెద్ద చేపలు కూడా జైలుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. పెద్ద చేప ఎవరనేదీ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే.

లిక్కర్‌ స్కాంలో పెద్ద చేపలు జైలుకు వెళ్లడం ఖాయం

  • కుంభకోణంలో జగన్‌తో రాజంపేట ఎంపీకూడా..: మాధవ్‌

రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగినట్టు సిట్‌ దర్యాప్తులో తేలింది. లిక్కర్‌ స్కాంలో ఇప్పటికే కొన్ని చేపలు జైలుకు వెళ్లాయి. రానున్న రోజుల్లో పెద్ద చేపలు కూడా జైలుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. పెద్ద చేప ఎవరనేదీ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న జగన్‌ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా నడిచింది. రాజంపేట ఎంపీ కూడా ఇందులో ఉన్నారు’ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం రక్తదాన శిబిరాన్ని మాధవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో నకిలీ బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీశారన్నారు. కార్యక్రమంలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి....

‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’

ఆర్‌వీ నగర్‌ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక

Updated Date - Sep 22 , 2026 | 05:47 AM