నేడు అమరావతికి బిల్ గేట్స్
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:49 AM
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం అమరావతికి వస్తున్నారు. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్...
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్‌లతో భేటీ
అమరావతి, గుంటూరు, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం అమరావతికి వస్తున్నారు. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో బిల్ గేట్స్ సమావేశమవుతారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రాజెక్టులను గేట్స్ బృందం పరిశీలించనుంది.
ఉదయం పది గంటలకు బిల్ గేట్స్ బృందం సచివాలయం మొదటి బ్లాక్‌లోని ఆర్‌టీజీఎస్ కు చేరుకుని వాట్సప్ ద్వారా మనమిత్ర పేరిట పౌరులకు అందిస్తున్న 800కు పైగా సేవలను గురించి తెలుసుకుంటారు. ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాలపై ముందస్తుగా సమాచారం ఇవ్వడం ద్వారా ప్రాణ నష్టాన్ని ఎలా నివారిస్తున్నామో బిల్ గేట్స్‌కు లోకేశ్ వివరిస్తారు. ఇందుకు ఇటీవల రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన తుఫానులు, వాటి ప్రభావంతో జరిగిన నష్టాలను నామమాత్రం చేయడం వంటి అంశాలను కూడా బిల్ గేట్స్ బృందానికి లోకేశ్ వివరించనున్నారు.
సీఎం చంద్రబాబు నివాసానికి సమీపంలోని పచ్చటి అరటితోటలో గేట్స్‌తో చర్చలకు వేదికని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయన సంజీవని ప్రాజెక్టు గురించి చర్చించడంతో పాటు టెక్నాలజీని వినియోగించి సాగు చేస్తున్న రైతులతోనూ సమావేశం అవుతారు.
ఈ వార్తలు కూడా చదవండి