భోగాపురం నుంచి బ్యాంకాక్‌కు విమానం
ABN , Publish Date - Oct 28 , 2026 | 05:16 AM
భోగాపురం నుంచి బ్యాంకాక్‌కు విమాన సర్వీసు త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ సర్వీసులు వారానికి రెండుసార్లు అందుబాటులో ఉంటాయి. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఈ సర్వీసులను నడపబోతోంది.
వారానికి రెండు రోజులు ఎయిర్ ఇండియా సర్వీసు
దీంతో ఆగ్నేయాసియాకు ప్రయాణం సులభతరం
భోగాపురం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): భోగాపురం నుంచి బ్యాంకాక్‌కు విమాన సర్వీసు త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ సర్వీసులు వారానికి రెండుసార్లు అందుబాటులో ఉంటాయి. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఈ సర్వీసులను నడపబోతోంది. జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కన్వర్‌భీర్ సింగ్ కల్రా మంగళవారం ఈమేరకు ఓ ప్రకటన చేశారు. ఈ విమానం ప్రతి మంగళవారం, శుక్రవారం భోగాపురం నుంచి భారత కాలమాన ప్రకారం ఉదయం 11.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు బ్యాంకాక్ చేరుకుంటుంది. అలాగే ప్రతి బుధవారం, శనివారం బ్యాంకాక్ నుంచి భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి తరువాత 12.40 గంటలకు బయలుదేరి వేకువజామున 3.55 గంటలకు భోగాపురానికి చేరుకుంటుంది.
ఈ విమాన సర్వీసుతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగ్నేయాసియాకు ప్రయాణించడం మరింత సులభమవుతుంది. విమానాశ్రయం అంతర్జాతీయ అనుసంధానాన్ని బలోపేతం చేయడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ మార్కెట్లతో సంబంధాలను విస్తరించడంలో ఈ సర్వీసులు కీలకంగా నిలుస్తాయి. ప్రపంచస్థాయి విమానయాన ప్రవేశద్వారంగా భోగాపురం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసే క్రమంలో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు కన్వర్‌భీర్ పేర్కొన్నారు. బ్యాంకాక్ నుంచి ఆసియాలోని పలు గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ సర్వీసులు మెరుగైన అనుసంధానాన్ని అందిస్తాయని తెలిపారు. దీంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాధాన్యం మరింత పెరుగుతుందని వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!
ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు