Share News

నామినేషన్‌ గడువుపై హైకోర్టుకు బీసీవై పార్టీ

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:11 AM

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్‌ గడువును ఆరు రోజుల వరకు పెంచేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్‌ హైకోర్టులో ..

నామినేషన్‌ గడువుపై హైకోర్టుకు బీసీవై పార్టీ

అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్‌ గడువును ఆరు రోజుల వరకు పెంచేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. చట్టనిబంధనల ప్రకారం నామినేషన్ల దాఖలుకు గరిష్ఠంగా ఆరు రోజులు అనుమతించవచ్చని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సకాలంలో కులధృవీకరణ పత్రాలు, నోడ్యూస్‌ సర్టిఫికేట్లు అందజేసేలా అధికారులు, ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరారు. గురువారం కోర్టు ప్రారంభమైన వెంటనే ఆయన తరఫున న్యాయవాది ఉమేష్‌చంద్ర స్పందిస్తూ... వ్యాజ్యం పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. ఈ అభ్యర్ధనను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి పిటిషన్‌ పై శుక్రవారం విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

మీ ఛాయిస్‌ ఎవరు?

మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 16 , 2026 | 05:11 AM