అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన
ABN , Publish Date - Sep 10 , 2026 | 10:22 AM
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
అమరావతి, సెప్టెంబర్ 10: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం ఉదయం 5:30 గంటల నాటికి ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడినట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారి, అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు రాబోయే 48 గంటల పాటు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో.. గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. సముద్రంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
పదేళ్ల పాటు శ్రమించిన యాపిల్.. త్వరలో ఫోల్డబుల్ ఐఫోన్ ఆవిష్కరణ!
మొబైల్ ఫోన్ ఫాస్ట్‌గా ఛార్జ్ కావాలంటే.. ఈ ట్రిక్స్ ట్రై చేయండి.!