Share News

ఆయుష్‌లో లైంగిక వేధింపులు!

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:06 AM

ఆయుష్‌ విభాగంలో మహిళా అధికారిని అదే శాఖకు చెందిన ఉన్నతాధికారి లైంగికంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆయుష్‌లో లైంగిక వేధింపులు!

  • మహిళా అధికారి పట్ల ఉన్నతాధికారి అసభ్య ప్రవర్తన

  • ఈ-మెయిల్‌ ద్వారా కమిషనర్‌కు బాధితురాలి ఫిర్యాదు

విశాఖపట్నం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ఆయుష్‌ విభాగంలో మహిళా అధికారిని అదే శాఖకు చెందిన ఉన్నతాధికారి లైంగికంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఆయుష్‌ విభాగంలో రీజినల్‌ స్థాయి అధికారి ఒకరు మూడు రోజుల క్రితం పొరుగు జిల్లాలో డిస్పెన్సరీ ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఆ కార్యక్రమం ముగిసిన తరువాత విశాఖ తిరుగు ప్రయాణమయ్యారు. అదే జిల్లాలో ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మహిళా అధికారి ఒకరు విశాఖ రావాల్సి ఉండటంతో సదరు అధికారితో కలిసి కారులో బయలుదేరారు.

మార్గమధ్యంలో ఉన్నతాధికారి ఆమెతో అసభ్యకరంగా మాట్లాడటంతో పాటు పదేపదే అభ్యంతరకరంగా తాకడం ప్రారంభించారు. కారులో ఆయనతో పాటు డ్రైవర్‌ మాత్రమే ఉండటంతో ఆమె నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. విశాఖ చేరుకున్న తరువాత కుటుంబసభ్యులకు, సహోద్యోగులకు జరిగిన విషయం చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. వారి సూచనల మేరకు ఆయుష్‌ కమిషనర్‌కు ఈ-మెయిల్‌ ద్వారా రెండు రోజుల క్రితమే బాధితురాలు ఫిర్యాదు చేశారని తెలిసింది.

ఈ వార్తలనూ చదవండి:

అంతా కొలిక్కి...

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 17 , 2026 | 04:55 AM