Share News

ఆర్నబ్ తుపాను ఎఫెక్ట్‌: ఏపీకి తెలంగాణ విద్యుత్ శాఖ సహకారం

ABN , Publish Date - Oct 28 , 2026 | 07:04 AM

ఆర్నబ్ తుపాను నేపథ్యంలో ఏపీలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం అదనపు సిబ్బంది, విద్యుత్ సామాగ్రి అందించేందుకు అంగీకరించింది.

ఆర్నబ్ తుపాను ఎఫెక్ట్‌: ఏపీకి తెలంగాణ విద్యుత్ శాఖ సహకారం
Cyclone Arnab

అమరావతి, అక్టోబర్ 28: ఆర్నబ్ తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో మంత్రి గొట్టిపాటి రవికుమార్, విజయానంద్ మాట్లాడి.. తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే త్వరితగతిన పునరుద్ధరించేందుకు అవసరమైన అదనపు సిబ్బంది, విద్యుత్ సామాగ్రిని అందించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. తుపాను విపత్తు సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. అవసరమైన సిబ్బందిని.. సామాగ్రిని ఏపీకి పంపేందుకు అంగీకరించింది.


తెలంగాణ ప్రభుత్వం సహకరించేందుకు అంగీకరించిన నేపథ్యంలో.. మంత్రి గొట్టిపాటి రవికుమార్ తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. తుపాను పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. తుపాను కారణంగా విద్యుత్ లైన్లు, ఇతర విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లిన పక్షంలో వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరాను కొనసాగించేందుకు విద్యుత్ శాఖ కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!

ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Updated Date - Oct 28 , 2026 | 08:16 AM