200 కోట్లతో విశాఖపట్నం క్లస్టర్‌లోని ఐటీఐల అభివృద్ధి
ABN , Publish Date - Oct 13 , 2026 | 04:54 AM
రాష్ట్రంలోని నాలుగు ప్రభుత్వ ఐటీఐలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంతో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయిబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్ త్రూ అప్‌గ్రేడెడ్ ఐటీఐస్ (పీఎం సేతు) కింద...
రాష్ట్ర ప్రభుత్వంతో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ఒప్పందం
న్యూఢిల్లీ, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నాలుగు ప్రభుత్వ ఐటీఐలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంతో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయిబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్ త్రూ అప్‌గ్రేడెడ్ ఐటీఐస్ (పీఎం సేతు) కింద విశాఖపట్నం క్లస్టర్ పరిధిలోని నాలుగు ప్రభుత్వ ఐటీఐలను అభివృద్ధి చేసేందుకు షేర్ హోల్డర్స్ ఒప్పందంపై సంతకాలు చేశారు. కేంద్ర నైపుణ్యాభివృద్థి శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నిప్పన్ స్టీల్ ఇండియా మధ్య ఈ ఒప్పందం కుదిరింది. విశాఖపట్నంలో నాలుగు ప్రభుత్వ ఐటీఐలతో కూడిన క్లస్టర్‌కు ఈ ఒప్పందం వర్తిస్తుంది.
బలమైన పారిశ్రామిక భాగస్వామ్యం, అంతర్జాతీయ స్థాయి శిక్షణ వసతుల ద్వారా భారతదేశ ఐటీఐ వ్యవస్థను మార్చడమే ఈ ఒప్పందం లక్ష్యం. పీఎం-సేతు పరిధిలో ఐటీఐల్లో పరిశ్రమ ఆధారిత మార్పులను తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా పనిచేస్తోంది. మొత్తం రూ.60 వేల కోట్ల పెట్టుబడితో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పీఎం సేతు పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ ఐటీఐలను మెరుగుపరుస్తారు.
ఈ వార్తలనూ చదవండి: