Share News

అరసవల్లి ఆలయ అభివృద్ధికి55 కోట్లు మంజూరు

ABN , Publish Date - Oct 01 , 2026 | 04:35 AM

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.55.74 కోట్ల నిధులు మంజూరయ్యాయని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. స్వదేశ్‌ దర్శన్‌ 2.0 కింద ఈ నిధులు విడుదలయినట్టు బుధవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.

 అరసవల్లి ఆలయ అభివృద్ధికి55 కోట్లు మంజూరు

  • కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.55.74 కోట్ల నిధులు మంజూరయ్యాయని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. స్వదేశ్‌ దర్శన్‌ 2.0 కింద ఈ నిధులు విడుదలయినట్టు బుధవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. అరసవల్లిని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్థి చేయడంతో పాటు... శ్రీకాకుళం గొప్ప వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఇది ఒక కీలక ముందడుగని పేర్కొన్నారు. స్వదేశ్‌ దర్శన్‌ కింద నిధులు కేటాయించినందుకు గాను ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు శ్రీకాకుళం ప్రజల తరపున రామ్మోహన్‌నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి...

ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’

రైతులకు తీపి కబురు

Updated Date - Oct 01 , 2026 | 04:35 AM