ఏపీపీఎస్సీ పరిధిలోకి వీఏఎస్ పోస్టులు
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:36 AM
పశుసంవర్ధకశాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల(వీఏఎస్) పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ నిబంధనలు-1963ను సవరించారు.
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): పశుసంవర్ధకశాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల(వీఏఎస్) పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ నిబంధనలు-1963ను సవరించారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వీఏఎ్‌సల నియామకాలను ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినందున, ఏపీపీఎస్సీ నిబంధనలకు వెలుపల ఉన్న ఈ పోస్టులను ఏపీపీఎస్సీ పరిధిలోకి తెచ్చేందుకు తాజాగా సవరణ ఉత్తర్వులు జారీచేసింది. ఏపీపీఎస్సీ రాత పరీక్షల ద్వారా వీఏఎస్ పోస్టులను భర్తీ చేయనుంది.
ఈ వార్తలనూ చదవండి:
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం