Share News

8 రకాల పోస్టులకు ఏపీపీఎస్సీ పూర్తిస్థాయి నోటిఫికేషన్లు

ABN , Publish Date - Oct 17 , 2026 | 05:54 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఇటీవల షార్ట్‌ నోటిఫికేషన్లు జారీచేసిన ఏపీపీఎస్సీ.. వీటిలో 8 రకాల పోస్టుల భర్తీకి శుక్రవారం పూర్తిస్థాయి నోటిఫికేషన్లు విడుదల చేసింది.

8 రకాల పోస్టులకు ఏపీపీఎస్సీ పూర్తిస్థాయి నోటిఫికేషన్లు

  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఇటీవల షార్ట్‌ నోటిఫికేషన్లు జారీచేసిన ఏపీపీఎస్సీ.. వీటిలో 8 రకాల పోస్టుల భర్తీకి శుక్రవారం పూర్తిస్థాయి నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో ఇండస్ర్టియల్‌ ప్రమోషన్‌ ఆఫీసర్‌-78, అటవీ శాఖలో గ్రేడ్‌-2 డ్రాఫ్ట్స్‌మెన్‌(టెక్నికల్‌ అసిస్టెంట్‌)-20, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌-5, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌-26, దేవదాయశాఖలో గ్రేడ్‌-3 ఈవోలు-104, మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్‌-1 సూపర్‌వైజర్‌లు-31, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులు-23, జువైనల్‌ వెల్ఫేర్‌ శాఖలో జిల్లా ప్రొబేషన్‌ అధికారి పోస్టులు-15 ఉన్నాయి. దరఖాస్తుల ప్రక్రియను వెంటనే ప్రారంభించింది. నవంబరు 5 వరకు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించే అవకాశం కల్పించింది.

ఈ వార్తలనూ చదవండి:

అంతా కొలిక్కి...

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 17 , 2026 | 05:54 AM