కొలువుల పండగ
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:06 AM
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ తీపి కబురు చెప్పింది. జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించిన విధంగా ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. 166 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి సోమవారం నోటిఫికేషన్ ఇచ్చింది.
166 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్
డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ సహా కీలక పోస్టులు
మరో 86 ఇతర పోస్టులకూ నోటిఫికేషన్లు
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ తీపి కబురు చెప్పింది. జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించిన విధంగా ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. 166 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి సోమవారం నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ సహా ఇతర ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే, కాలుష్య నియంత్రణ మండలిలో సహాయ పర్యావరణ ఇంజనీర్ పోస్టులు 41, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు 37, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సర్వీసెస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ 8 పోస్టులకు మరో మూడు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లకు మంగళవారం నుంచే దరఖాస్తులు స్వీకరిస్తారు. జనవరిలో గ్రూప్-1 పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం