Share News

ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తుల గడువు పొడిగింపు

ABN , Publish Date - Oct 28 , 2026 | 05:06 AM

ఇటీవల విడుదల చేసిన పలు ఉద్యోగ నోటిఫికేషన్ల దరఖాస్తుల గడువును ఏపీపీఎస్సీ పొడిగించింది. అభ్యర్థుల వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నవంబరు 9 అర్థరాత్రి వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తుల గడువు పొడిగింపు

అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ఇటీవల విడుదల చేసిన పలు ఉద్యోగ నోటిఫికేషన్ల దరఖాస్తుల గడువును ఏపీపీఎస్సీ పొడిగించింది. అభ్యర్థుల వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నవంబరు 9 అర్థరాత్రి వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. గ్రూప్‌-1, సహాయ పర్యావరణ అధికారి, ఉద్యాన శాఖ అధికారి, గిరిజన, బీసీ, సాంఘీక సంక్షేమ గ్రేడ్‌-2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, సహాయ గిరిజన సంక్షేమ అధికారి, సహాయ సాంఘీక సంక్షేమ అధికారి నోటిఫికేషన్లకు ఈ పొడిగింపు వర్తిస్తుందని వివరించింది. గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్ష తేదీలో ఎలాంటి మార్పులు ఉండవని పేర్కొంది.

ఈ వార్తలనూ చదవండి:

తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!

ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Updated Date - Oct 28 , 2026 | 05:06 AM