కొలువుల జాతర!
ABN , Publish Date - Nov 11 , 2026 | 04:18 AM
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. ఈ నెల మొదటి వారంలోనే 2,721 పోస్టుల భర్తీ కోసం పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయగా ఇప్పుడు కీలకమైన...
720 గ్రూప్-2 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
471 ఎగ్జిక్యూటివ్, 249 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
డిప్యూటీ ఎంపీడీవో - 176, డీటీ - 203 ఖాళీలు
దరఖాస్తుల సమర్పణకు తుదిగడువు డిసెంబరు 11
ఫిబ్రవరి 21న ఆఫ్‌లైన్ విధానంలో స్ర్కీనింగ్ పరీక్ష
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. ఈ నెల మొదటి వారంలోనే 2,721 పోస్టుల భర్తీ కోసం పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయగా ఇప్పుడు కీలకమైన 720 గ్రూప్-2 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ మంగళవారం సమగ్ర నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంతకుముందు ఇచ్చిన షార్ట్ నోటిఫికేషన్ కంటే తాజాగా పోస్టుల సంఖ్య పెరిగింది. ఇందులో 471 ఎగ్జిక్యూటివ్, 249 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ విభాగంలో గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్- 6, డిప్యూటీ మండల పరిషత్ డెవల్‌పమెంట్ ఆఫీసర్- 176, సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్- 10, డిప్యూటీ తహసీల్దార్- 203, రిజిస్ర్టేషన్ల శాఖలో గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్- 7, జీఎస్టీ ఆఫీసర్- 40, ఎక్సైజ్ ఎస్‌ఐ- 29 ఖాళీలు ఉన్నాయి.
అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో జీఏడీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 71, ఆర్థిక శాఖ ఏఎ్‌సవో 5, న్యాయశాఖ ఏఎ్‌సవో 4, ట్రెజరీ(హెచ్‌వోడీ)లో సీనియర్ అకౌంటెంట్ 90, ట్రెజరీ(జిల్లా)లో సీనియర్ అకౌంటెంట్ 1, ట్రెజరీ జూనియర్ అకౌంటెంట్ 47, పరిశ్రమల శాఖలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 2, వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 3, పశుసంవర్థక శాఖలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 1, జైళ్ల శాఖలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 1, ఏజీ ఆఫీస్‌లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 1, రోడ్లు భవనాల ఈఎన్‌సీ కార్యాలయంలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 1, ప్రభుత్వ పరీక్షల విభాగంలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 5, పౌరసరఫరాల కమిషనరేట్‌లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 3, బీమా, మెడికల్ సర్వీసెస్ డైరెక్టరేట్‌లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 2, ఏపీ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ శాఖలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 3, ప్రాసిక్యూషన్స్ డైరెక్టరేట్‌లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 1, బాయిలర్స్ డైరెక్టరేట్‌లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 1, పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 1, పాఠశాల విద్య కమిషనరేట్‌లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 2, ఉన్నత విద్య కమిషనరేట్‌లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 1, వ్యవసాయశాఖలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 2, పురపాలక శాఖ కమిషనరేట్‌లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 1 పోస్టులు ఉన్నాయి.
మంగళవారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు డిసెంబరు 11 అని కమిషన్ పేర్కొంది. అభ్యర్థులు తొలుత ఓటీపీఆర్ రిజిస్ర్టేషన్ చేసుకోవాలి. ఫిబ్రవరి 21న స్ర్కీనింగ్ పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో ఉంటుంది. అనంతరం మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు
30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!