ఏపీఐఐసీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ రద్దు
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:33 AM
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ)లో ఉద్యోగ నియామకాల్లో కీలకమైన మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ)లో ఉద్యోగ నియామకాల్లో కీలకమైన మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఉద్యోగాలకు గతంలో ఉన్న ఇంటర్వ్యూను మినహాయించి, రాతపరీక్షను మాత్రమే నియామకాలకు ప్రాతిపదికగా నిర్ణయించింది. ఈ మేరకు ఏపీఐఐసీ స్టాఫ్ రెగ్యులేషన్స్-1974ను సవరించేందుకు అనుమతించింది. ఏపీఐఐసీ స్టాఫ్ రెగ్యులేషన్స్‌ను సవరించే అధికారం ఆ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు మాత్రమే ఉండటంతో, ఈ సవరణ ప్రతిపాదనను బోర్డు ముందు ఉంచేందుకు ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీకి అనుమతి ఇస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ వార్తలనూ చదవండి..