జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు
ABN , Publish Date - Oct 14 , 2026 | 04:20 AM
రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాల జడ్పీ చైర్‌పర్సన్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం (1994) నిబంధనలు పాటిస్తూ కచ్చితంగా 50 శాతం.. .
28లో బీసీలకు 6, ఎస్సీ-5, ఎస్టీ-3
బీసీలకు- శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం,
అనకాపల్లి, అనంతపురం, కర్నూలు
ఎస్సీలకు - కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు,ప్రకాశం, తిరుపతి
ఎస్టీలకు -అల్లూరి, మన్యం, పోలవరం
జనరల్‌కు -కాకినాడ, తూర్పు, పశ్చిమ, ఏలూరు,కృష్ణా, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, నెల్లూరు, నంద్యాల, అన్నమయ్య, కడప, సత్యసాయి, చిత్తూరు
అమరావతి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాల జడ్పీ చైర్‌పర్సన్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం (1994) నిబంధనలు పాటిస్తూ కచ్చితంగా 50 శాతం.. అంటే 14 చైర్‌పర్సన్ స్థానాలను మహిళలకే కేటాయించారు. ఈ మేరకు పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ మంగళవారం అధికారికంగా గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ (అన్ రిజర్వ్‌డ్) విభాగాల వారీగా మహిళలకు పదవులు కేటాయించారు. 8 జిల్లాలను జనరల్ మహిళలకు, 3 జిల్లాలను బీసీ మహిళలకు, 2 జిల్లాలను ఎస్సీ మహిళలకు, ఒక జిల్లాను ఎస్టీ మహిళకు నిర్దేశించారు.
తాజా రిజర్వేషన్ల ఖరారు కోసం.. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటుచేసిన డేడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్రప్రభుత్వం ఆమోదించింది. దీని ప్రకారం జడ్పీ చైర్‌పర్సన్ పదవుల్లో బీసీల రిజర్వేషన్‌ను 23.08 శాతంగా స్థిరీకరించి.. 28 జిల్లాల్లో 7 స్థానాలను బీసీలకు (3 బీసీ మహిళ, 4 బీసీ జనరల్) కేటాయించారు. తద్వారా న్యాయపరమైన అడ్డంకులు లేకుండా బీసీలకు రాజకీయ భాగస్వామ్యం లభించింది. ఎస్సీలకు 5, ఎస్టీలకు 3 స్థానాలు కేటాయించారు. చట్టపరమైన నిబంధనలు పాటిస్తూనే అటు సామాజిక వర్గాలకు, ఇటు మహిళా ప్రాతినిధ్యానికి సమ ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం వ్యూహాత్మక సమతుల్యత సాధించినట్లు స్పష్టమవుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత