ఐదు రోజులు వర్షాలు
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:56 AM
ఉపరితల ఆవర్తనం, ద్రోణితో పాటు ఈశాన్య రుతుపవనాల రాక ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు14 (ఆంధ్రజ్యోతి): ఉపరితల ఆవర్తనం, ద్రోణితో పాటు ఈశాన్య రుతుపవనాల రాక ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. గురువారం మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, బుధవారం తిరుపతి జిల్లా కలుగుర్తిపాడులో 39.9, చిట్టమూరులో 39.4, విశాఖ జిల్లా పద్మనాభంలో 35.2, తిరుపతి జిల్లా కొత్తగుంటలో 33.6, విజయనగరం జిల్లా డెంకాడలో 29.7, నెల్లూరు జిల్లా అల్లంపాడులో 28, అనకాపల్లి జిల్లా సబ్బవరంలో 27.5, నెల్లూరు జిల్లా చింతవరం, గూడూరులో 26 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..