Share News

ఉప్పుకయ్యల భూములు కేంద్రానికి అప్పగింత

ABN , Publish Date - Oct 06 , 2026 | 05:32 AM

రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న 20,377.73 ఎకరాల ఉప్పుకయ్యల భూములను కేంద్ర ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలని రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన శాఖ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిపార్టుమెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రి అండ్‌ ఇంటర్నల్‌ ట్రాన్స్‌ఫర్‌(డీపీఐఐటీ) అంతర్జాతీయ పాలసీని జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర పరిధిలోని ఈ భూములను వెనక్కు తీసుకోవాల ని నిర్ణయించింది.

ఉప్పుకయ్యల భూములు కేంద్రానికి అప్పగింత

అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న 20,377.73 ఎకరాల ఉప్పుకయ్యల భూములను కేంద్ర ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలని రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన శాఖ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిపార్టుమెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రి అండ్‌ ఇంటర్నల్‌ ట్రాన్స్‌ఫర్‌(డీపీఐఐటీ) అంతర్జాతీయ పాలసీని జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర పరిధిలోని ఈ భూములను వెనక్కు తీసుకోవాల ని నిర్ణయించింది. దీంతో.. ఇప్పటికే ఈ భూముల్లో లీజుదారులుగా ఉన్నవారికి చెల్లింపులు చేయడంపై రాష్ట్ర మౌలిక సదుపాయల కల్పనా శాఖ ఉన్నతస్థాయి కమిటీని వేసింది. ఇప్పుడు వాటిని వెనక్కు తీసుకోవాలంటే లీజుదారులకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు లీజు మొత్తాలను వాపసు చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఎంతో ఖరారు చేసేందుకు ఏపీ మారిటైమ్‌బోర్డు సీఈవో కన్వీనర్‌గా కమిటిని నియమించింది.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 05:32 AM