మైనార్టీల కోసం ‘రిఫార్మ్ ఉత్సవ్’: మంత్రి ఫరూక్
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:43 AM
కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు అనుబంధంగా ఉన్న ఎన్‌ఎండీఎఫ్‌సీ(నేషనల్ మైనార్టీస్ డెవల్‌పమెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో అక్టోబరు 8వ తేదీన మైనార్టీల కోసం ’ రిఫార్మ్ ఉత్సవ్’ భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు.
అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు అనుబంధంగా ఉన్న ఎన్‌ఎండీఎఫ్‌సీ(నేషనల్ మైనార్టీస్ డెవల్‌పమెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో అక్టోబరు 8వ తేదీన మైనార్టీల కోసం ’ రిఫార్మ్ ఉత్సవ్’ భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. విజయవాడలోని అంబేద్కర్ కళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. లబ్ధిదారులకు, ప్రభుత్వానికి మధ్య ఇదొక వారధిలా పని చేస్తుందన్నారు. ఈ మెగా అవగాహనా సదస్సుకు రాష్ట్రంలోని మైనార్టీ యువత, నిరుద్యోగులు, మహిళా సంఘాల ప్రతినిధులు, లబ్ధిదారులు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ వార్తలనూ చదవండి...
ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’