శ్రీవారి సేవలో న్యాయమూర్తులు
ABN , Publish Date - Oct 03 , 2026 | 05:01 AM
తిరుమల శ్రీవారిని శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి.సునీత, జస్టిస్ జయసూర్య, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ దర్శించుకున్నారు.
తిరుమల, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి.సునీత, జస్టిస్ జయసూర్య, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన న్యాయమూర్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు. అలాగే భారత్ లోక్‌పాల్ న్యాయసభ్యులు జస్టిస్ రీతురాజ్ అవస్థి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి..
స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు
శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు