Share News

బోధనాస్పత్రుల్లో ప్రీ హాస్పిటల్‌ నోటిఫికేషన్‌

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:23 AM

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి వీలైనంత త్వరగా చికిత్స అందిస్తే ప్రాణాలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ దిశగా వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం రెండు కీలక కార్యక్రమాలను ప్రారంభిస్తోంది.

బోధనాస్పత్రుల్లో ప్రీ హాస్పిటల్‌ నోటిఫికేషన్‌

  • రోగి పరిస్థితిపై ఆస్పత్రికి ముందస్తు సమాచారం

అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి వీలైనంత త్వరగా చికిత్స అందిస్తే ప్రాణాలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ దిశగా వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం రెండు కీలక కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. దీనికోసం ప్రీ-హాస్పిటల్‌ నోటిఫికేషన్‌ విధానంతో పాటు రాష్ట్ర ట్రామా రిజిస్ట్రీని అందుబాటులోకి తెస్తున్నట్టు అదనపు డీఎంఈ డాక్టర్‌ సత్యనారాయణ మూర్తి ట్రామా, బర్న్స్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ సుమితా శంకర్‌ శుక్రవారం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పపత్రికి తీసుకువచ్చేలోపు లేదా 108 అంబులెన్సులో ఉన్నప్పుడే విలువైన సమయం వృథా కాకుండా అతని ఆరోగ్య పరిస్థితిపై ముందస్తు సమాచారాన్ని ఆస్పత్రిలోని వైద్యసిబ్బందికి అందించడం ప్రీ హాస్పిటల్‌ నోటిఫికేషన్‌ లక్ష్యం.

ఈ సమాచారం అందగానే ఆస్పత్రిలోని డాక్టర్లు, వైద్య సిబ్బంది అప్రమత్తమై ఆ రోగి వచ్చేసరికల్లా ఐసీయూ, ఆపరేషన్‌ థియేటర్‌, అత్యవసర పరికరాలు సిద్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలుగా రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న 108 సిబ్బంది, అత్యవసర వైద్య సాంకేతిక నిపుణులు, నర్సులకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు.

ఈ వార్తలనూ చదవండి:

అంతా కొలిక్కి...

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 17 , 2026 | 04:23 AM