Share News

మాట నిలబెట్టుకోవడమే కూటమి మార్క్‌ పాలన: వర్మ

ABN , Publish Date - Oct 15 , 2026 | 05:18 AM

‘సీబీఎన్‌ అంటే డీఎస్సీ. డీఎస్సీ అంటే సీబీఎన్‌. మాట ఇస్తే నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వ మార్క్‌ పాలన’ అని టీడీపీ సీనియర్‌ నాయకులు ఎస్వీఎస్ఎన్‌ వర్మ అన్నారు.

మాట నిలబెట్టుకోవడమే కూటమి మార్క్‌ పాలన: వర్మ

అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ‘సీబీఎన్‌ అంటే డీఎస్సీ. డీఎస్సీ అంటే సీబీఎన్‌. మాట ఇస్తే నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వ మార్క్‌ పాలన’ అని టీడీపీ సీనియర్‌ నాయకులు ఎస్వీఎస్ఎన్‌ వర్మ అన్నారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 150 రోజుల్లోనే మెగా డీఎస్సీ నిర్వహించాం. 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశాం. నిరుద్యోగుల ఇళ్లలో వెలుగులు నింపాం. గతంలో నిలిచిపోయిన కాంట్రాక్ట్‌ లెక్చరర్ల సేవలను పునరుద్ధరించడంతోపాటు 90 మంది ఎస్టీ యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించాం. వరుసగా 2 సార్లు డీఎస్సీ నోటిఫికేష్లు ఇచ్చిన విద్యా మంత్రిగా లోకేశ్‌ చరిత్రలో నిలిచిపోతారు’ అని వర్మ అన్నారు.


నిరుద్యోగులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్సీ వేపాడ

‘కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల ఆశలను నెరవేర్చే దిశగా పనిచేస్తోంది’ అని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి అన్నారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను సాకారం చేస్తూ వార్షిక జాబ్‌ క్యాలెండర్‌ను మంత్రి లోకేశ్‌ ఈ ఏడాది ఉగాది రోజు విడుదల చేశారు. అందులో భాగంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, గ్రూప్‌-1 పోస్టులు, పోలీసు నియామకాల నోటిఫికేషన్‌ ఇచ్చాం. తాజాగా మరోసారి డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చాం. నిరుద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించేది కూటమి ప్రభుత్వమే’ అని ఎమ్మెల్సీ చిరంజీవి అన్నారు.

ఉద్యోగాల కల్పనలో టీడీపీ ముందంజ: బుచ్చిరాంప్రసాద్‌

టీడీపీ తొలి నుంచి నిరుద్యోగుల ఆశలను సాకారం చేస్తూ కొలువుల కల్పనకు పెద్దపీట వేస్తోందని బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుచ్చిరాంప్రసాద్‌ అన్నారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో 14 సార్లు డీఎస్సీ నిర్వహించిన ఘనత టీడీపీదే. 1.96 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయ కొలువులు అందించిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుంది. బ్రాహ్మణ నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు అవసరమైన ఉచిత శిక్షణ తరగతులు, స్టడీ మెటీరియల్‌ అందించి మార్గదర్శకత్వం చేసేందుకు బ్రాహ్మణ కార్పొరేషన్‌ సిద్ధంగా ఉంది’ అని బుచ్చిరాంప్రసాద్‌ తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్‌ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి

హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..

Updated Date - Oct 15 , 2026 | 05:18 AM