Share News

బాలల ఆరోగ్యమే రాష్ట్ర భవిష్యత్తుకు పునాది

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:48 AM

బాలల ఆరోగ్యమే రాష్ట్ర భవిష్యత్తుకు పునాది అని స్ర్తీ, శిశు సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. రాష్ట్రంలోని ప్రతి చిన్నారికీ పౌష్టికాహారం అందించడం, గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిరక్షణ, అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

బాలల ఆరోగ్యమే రాష్ట్ర భవిష్యత్తుకు పునాది

  • రాష్ర్టీయ పోషణ మాసం-2026లో మంత్రి సంధ్యారాణి

గన్నవరం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): బాలల ఆరోగ్యమే రాష్ట్ర భవిష్యత్తుకు పునాది అని స్ర్తీ, శిశు సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. రాష్ట్రంలోని ప్రతి చిన్నారికీ పౌష్టికాహారం అందించడం, గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిరక్షణ, అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మహిళాభివృద్థి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం కష్ణా జిల్లా గన్నవరంలో నిర్వహించిన 9వ రాష్ర్టీయ పోషణ మాసం-2026 కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లలో అంగన్‌వాడీ కేంద్రాల్లో 5,389 మంది కార్యకర్తలు, 4,061 సహాయకుల పోస్టులు భర్తీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. మరో 1,066 మంది కార్యకర్తలు, 4,250 సహాయకుల పోస్టులు నోటిఫికేషన్‌ దశలో ఉన్నాయని తెలిపారు. బాలల ప్రారంభ దశ అభివృద్థిలో భాగంగా ఏఐ ఆధారిత స్ర్కీనింగ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మహిళా అభివృద్థి, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎ.సూర్యకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 06:48 AM